తెలంగాణ

telangana

ETV Bharat / crime

మందేసాడు.. మోత మోగించాడు.. చివరకు? - పుట్టిన రోజు

Birthday Party Fight In Vikarabad: కుమారుడి పుట్టిన రోజును గ్రాండ్​గా సెలబ్రేట్ చేయాలనుకున్నాడు. దాని కోసం అంతా ప్లాన్ చేశాడు. బంధువులను, స్నేహితులను పిలిచాడు. అందరూ వచ్చారు. కేక్ కూడా కట్ చేశారు. ఇక భోజనాలు చేయడానికి రెడీ అయ్యారు. ఆడవాళ్లంతా డిన్నర్ చేస్తున్నారు. మరోవైపు మగవాళ్లు మందు సిట్టింగ్ వేశారు. ఇంతలోనే గట్టిగట్టిగా శబ్ధాలు వినిపిస్తున్నాయి. ఏమైందోనని ఆడవాళ్లంతా బయటకు వెళ్లిచూస్తే కొడుకు బర్త్ డే పార్టీకి పిలిచిన వ్యక్తి.. వచ్చిన బంధువులపై దాడి చేస్తున్నాడు. అతడిని ఆపడానికి ప్రయత్నించిన ఆడవాళ్లపైనా విరుచుకుపడ్డాడు. ఇంతకీ ఏం జరిగింది..? ఇంటికి పిలిచి మరీ బంధువులను ఎందుకు చితకబాదాడు..?

liquor
మందు

By

Published : Feb 14, 2023, 3:16 PM IST

Updated : Feb 15, 2023, 6:54 AM IST

Birthday Party Fight: ఆ ఇంటికి వాళ్ల అక్క వచ్చి చాలా దినాలు అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన అక్కను వాళ్ల ఇంటికి పిలవనే లేదు ఆ తమ్ముడు. అయితే కొడుకు మొదటి పుట్టినరోజు కావడంతో తోబుట్టువును ఇంటికి పిలుద్దామనుకున్నాడు. ఆ విధంగానే వాళ్లకు ఫోన్​ చేసి.. అక్క నీవు ఇంటికి వచ్చి చాలా రోజులు అయ్యింది కదా.. నీ మేనల్లుడి పుట్టినరోజు ఉంది రా అని బ్రతిమాలాడు. తమ్ముడు ఇంతలా అడుగుతుంటే తోడబుట్టినది కాదన గలదా.! అయితే ఆమె సరే వస్తాను అని చెప్పింది. ఆ పుట్టినరోజు రానే వచ్చింది. ఇంటికి వాళ్ల అక్క వచ్చింది. ఇంతవరకూ బాగానే ఉంది.. అయితే ఇక్కడే ఒక విచిత్రం జరిగింది.

నిందితుడు

అప్పటికే మద్యం మత్తులో ఉన్న యువకుడు.. కారు విషయంలో.. వచ్చిన వాళ్ల అక్కతో సహా కుటుంబ సభ్యులు అందరిపై.. విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా అత్వెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సందీప్ కుమార్ అనే యువకుడిని అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. సందీప్ కుమార్ అనే యువకుడు కుటుంబంతో సహా వికారాబాద్ జిల్లా అత్వెల్లి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. తన కుమారుడి మొదటి పుట్టిన రోజు కావడంతో అక్కను పిలవాలి అనుకున్నాడు. వాళ్ల అక్క కుటుంబంతో సహా వచ్చింది. ఆ అర్ధరాత్రి మద్యం మత్తులో మునిగిపోయిన సందీప్ కుమార్.. బంధువైన రాజును కారు ఇవ్వమని అడిగాడు. నీకు మందు ఎక్కువైందని.. ఇవ్వను అని రాజు చెప్పడంతో.. వివాదం మొదలైంది. తాగిన మత్తులో సందీప్ వారితో​ గొడవకు దిగాడు.

బంధువులపై విచక్షణారహితంగా దాడి: సందీప్ బంధువులందరిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇంట్లో నుంచి ఎవరు వెళ్లకుండా బయట నుంచి తాళం వేసి హల్​చల్​ చేశాడు. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడ్డాడు. ఇంటి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశాడు. కిటికీకున్న గాజు అద్దాలు పగులగొట్టి ఆ పెంకులను వారిపై విసిరాడు. దీంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. భయంభయంగా రక్షించాలంటూ పోలీస్ హెల్ఫ్​లైన్​ నంబరు 100కు ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ యువకుడిని విచారిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 15, 2023, 6:54 AM IST

ABOUT THE AUTHOR

...view details