వేగంగా వచ్చిన బైక్.. కారును ఢీ కొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం.. యాదాద్రి భువనగిరి జిల్లా నందనం గ్రామ సమీపంలో జరిగింది. భువనగిరికి చెందిన మహేందర్, సందీప్‌లు బైక్‌పై వలిగొండ వైపునకు బయలుదేరారు. నందనం గ్రామ శివారు వద్ద ఎదురుగా వస్తున్న కారును మితిమీరిన వేగంతో వెళ్లి ఢీ కొట్టారు. ఘటనలో సందీప్ అక్కడిక్కడే ప్రాణాలు విడువగా.. మహేందర్ తీవ్ర గాయాల పాలయ్యాడు.
మితిమీరిన వేగం.. తీసిన నిండు ప్రాణం - బైక్ కారు ఢీ
అతివేగానికి ఓ నిండు ప్రాణం బలైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో.. వేగంగా వచ్చిన బైక్, కారును ఢీ కొన్న ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు విడిచాడు.
మితిమీరిన వేగం.. తీసిన నిండు ప్రాణం
స్థానికులు.. క్షతగాత్రుడిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:కృష్ణా నదిలో యువకుడి గల్లంతు