మహబూబ్నగర్లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను ఒకటో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్నగర్ పట్టణంలో గత రెండు నెలల నుంచి ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురి సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపి ఉంచిన బైక్లనే వారు లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతూ ఉండేవారని పోలీసులు పేర్కొన్నారు. వారి దగ్గర ఎక్కువ సంఖ్యలో వివిధ రకాల బైక్లు ఉన్నట్లు సమాచారం రావడంతో విచారణ చేపట్టామని... దీంతో చోరీ వ్యవహారం బయటపడిందని పోలీసులు వెల్లడించారు.