లారీని ఢీకొట్టిన బైక్.. ముగ్గురు యువకులు దుర్మరణం - road accident in pitlam
13:30 June 13
కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
Kamareddy Road Accident Today : కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గద్దగుండ తండాలో విషాదం చోటుచేసుకుంది. లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మృతులు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బొర్గి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరు ముగ్గురు కలిసి బైకుపై పెద్ద శంకర్‌పేట్ వెళ్తుండగా.. లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో స్పాట్‌లోనే ఇద్దరు చనిపోగా... మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మృతి చెందారు. బొర్గికి చెందిన విజయ్(19), పాండురంగ్(12)లు సోదరులు కాగా.. గాంధీనగర్‌కు చెందిన సచిన్ (19) వాళ్ల బంధువు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం చెందడంతో ఆ మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పని మీద బయటకు వెళ్లిన తమ పిల్లలు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపించాయి.