తెలంగాణ

telangana

ETV Bharat / crime

బైక్​కు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తి - తెలంగాణ వార్తలు

ద్విచక్ర వాహనానికి గుర్తుతెలియని వ్యక్తి నిప్పు పెట్టిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బాలాజీనగర్​లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

bike burned at balajinagar in badradri kothagudem district
బైక్​కు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తి

By

Published : Mar 21, 2021, 11:15 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బాలాజీ నగర్ పంచాయతీ పరిధిలో మురళి అనే లారీ డ్రైవర్ 4 నెలల క్రితం వాయిదాల పద్ధతిలో యునికాన్ బైక్ కొనుక్కున్నాడు. ఇంటి పక్కన సందులో ఉన్న బండిని శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టడంతో గమనించిన పక్కింటి వాళ్లు... మురళికి చెప్పారు. కాలిపోతున్న బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలుతుందో అన్న భయంతో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు.

ఇటీవల సాయి అనే యువకుడితో జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఇరువురు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసుకున్నామని.. తర్వాత రాజీ కూడా పడ్డామని మురళి తెలిపారు. వారి మీద తమకు అనుమానం చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:నిరీక్షణకు తెర... సుదీర్ఘంగా కొనసాగిన పట్టభద్ర ఓట్ల లెక్కింపు

ABOUT THE AUTHOR

...view details