తెలంగాణ

telangana

ETV Bharat / crime

Road accident: ప్రమాదంలో నవవధువు మృతి.. 'హేమ ఎక్కడంటూ' భర్త... - road accident news

పర్యాటక అందాలు తిలకించేందుకు బయల్దేరారు ఆ నవదంపతులు(newly marriage couple). సరదాగా బైక్​పై కబుర్లు చెప్పుకుంటూ వెళ్దామనుకున్నారు. కానీ ఇంతలోనే కారు రూపంలో మృత్యువు(newly married couple died in visakha dist vanjangi) దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో(Road accident news) నవవధువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన భర్త... భార్య చనిపోయిన విషయం తెలియక 'హేమను పిలవండి' అని అడగడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

road accident news, ap accident news
రోడ్డు ప్రమాదాలు, రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి

By

Published : Nov 13, 2021, 2:18 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతం వంజంగి రోడ్డుపై విషాదం(newly married couple died in visakha dist vanjangi) జరిగింది. పర్యాటక ప్రాంతాలను చూడడానికి నవదంపతులు బయల్దేరారు. వారిద్దరూ బైక్​పై వెళ్తుండగా కారు రూపంలో మృత్యువు(newly married couple died in visakha dist vanjangi) ఎదురొచ్చింది. వంజంగిలో వారి ద్విచక్రవాహనం-కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో నవవధువు హేమ అక్కడికక్కడే మృతిచెందగా, భర్త తరుణ్‌ కుమార్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వంజంగిని తిలకించేందుకు విశాఖ సీతంపేట నుంచి మూడు ద్విచక్రవాహనాలపై స్నేహితులతో కలిసి ఈ నవ దంపతులు వస్తుండగా.. వారి బైక్ ప్రమాదానికి గురైంది. కాగా.. ఈ ఘటనలో భార్య చనిపోయిన విషయం తెలియని భర్త ఆస్పత్రిలో చికిత్సపొందుతూ.. హేమను పిలవండి అంటూ విలపించడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

ప్రమాదంలో నవవధువు మృతి

ఇదీ చదవండి :Murder case news: మంత్రాల నెపంతో మతిస్థిమితం లేని వ్యక్తిని చంపేశారు!

ABOUT THE AUTHOR

...view details