తెలంగాణ

telangana

ETV Bharat / crime

అదుపు తప్పి స్కూటీ బోల్తా.. ఢీ కొట్టిన బస్సు - అక్కడికక్కడే మృతి

రాజేంద్ర నగర్ పీఎస్​ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు రోడ్డుపై పడ్డాడు.. దీంతో వెనుకనుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు అతని తలపైనుంచి దూసుకెళ్లింది. ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

bike accident news rajendra nagar ps area
Accident: బైక్ అదుపు తప్పి బోల్తా.. ఢీ కొట్టిన బస్సు

By

Published : Jun 6, 2021, 7:45 PM IST

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. అరంగల్ చౌరస్తా సమీపంలో ఈ ఘటన జరిగింది. స్కూటీపై వెళ్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో… వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు అతని తలపై నుంచి వెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు శ్రీనివాస్ మృతదేహాన్ని… పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. మృతుడు నందిగామకు చెందిన శ్రీనివాస్​గా గుర్తించారు. ఎలక్ట్రిషన్ డిపార్ట్​మెంట్​లో విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:పోలీసులకు చిక్కిన చైన్​స్నాచర్లు

ABOUT THE AUTHOR

...view details