తెలంగాణ

telangana

ETV Bharat / crime

యువకుల మితిమీరిన వేగం... బాలిక పరిస్థితి విషమం! - తెలంగాణ వార్తలు

ట్రాఫిక్​ పోలీసులు ఎన్ని నిబంధనలు తీసుకొచ్చినా కొందరు గాలికొదిలేస్తున్నారు. జన సందడి అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎస్సార్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో అతివేగంగా దూసుకొచ్చిన ద్విచక్రవాహనం చిన్నారిని ఢీకొంది. బాలిక ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంది.

bike-accident-and-girl-in-critical-situation-at-sr-nagar-in-hyderabad
మితిమీరిన వేగం... ప్రాణాపాయ స్థితిలో బాలిక!

By

Published : Feb 6, 2021, 9:54 AM IST

మితిమీరిన వేగం... ప్రాణాపాయ స్థితిలో బాలిక!

మితిమీరిన వేగంతో వస్తున్న ద్విచక్ర వాహనం చిన్నారిని ఢీకొంది. ప్రస్తుతం బాలిక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. హైదరాబాద్​ ఎస్సార్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది.

ముగ్గురు పిల్లలను తీసుకొని ఓ తల్లి వెళ్తుండగా ముగ్గురు యువకులు ఉన్న ద్విచక్రవాహనం అతివేగంగా దూసుకొచ్చింది. రోడ్డు దాటుతున్న బాలికను ఢీ కొట్టి... ఆపకుండా ముగ్గురు యువకులు పరారయ్యారు. ఆ వాహనానికి ముందు వైపు నంబర్ ప్లేట్ లేదని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:అమెరికాలో మోసం.. కళ్లుకప్పి.. కారేపల్లికి!

ABOUT THE AUTHOR

...view details