Murder in yadadri bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం వచ్చిన ఓ బీహార్ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్య చేశారు.
అసలేం జరిగిందంటే...

బీహార్‌కి చెందిన నిరంజన్ కుమార్ అనే 22సంవత్సరాల యువకుడు పోచంపల్లి మండలం దోటిగూడెం గ్రామ శివారులోని రావూస్ లాబ్స్‌లో పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు డ్యూటీ పూర్తి చేసుకున్న అతను మెడిసిన్ తెచ్చుకోవడం కోసం చౌటుప్పల్ వెళ్లాడు. రాత్రి అవుతున్నా అతను రూమ్‌కి తిరిగి రాలేదు. స్నేహితులు ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. తెల్లవారు జామున చూస్తే కంపెనీ పక్కన ఉన్న వ్యవసాయ పొలం వద్ద కత్తిపోట్లతో హత్యకు గురై ఉన్నాడు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన ప్రాంతంలో మద్యం సీసాలు ఉండడంతో రాత్రి అతనితో ఉన్న వారే హత్య చేశారా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు.