తెలంగాణ

telangana

ETV Bharat / crime

మారణాయుధాలతో బీదర్ వాసులు.. ఒంటరిగా వెళ్లే దంపతులే వారి లక్ష్యం?

జన సంచారం లేని దారుల్లో వాళ్లు గుంటనక్కల వలె వేచి చూస్తారు. దారిలో ఏదైనా జంట కనిపిస్తే చాలు పండుగ చేసుకుంటారు. ఒంటరిగా వెళ్తున్న దంపతులపై (mob attacks on couple ) మాటు వేసి... మారణాయుధాలతో వెంటాడి, వేటాడి దోచుకోవడమే వారి లక్ష్యం. ఇంతటి భయంకరమైన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఎక్కడంటే..

bidhr-mob-arrested
మారణాయుధాలతో బీదర్ వాసులు

By

Published : Sep 20, 2021, 1:47 PM IST

సంగారెడ్డి జిల్లా చిరాగ్​పల్లి పోలీసులు.. మొగుడంపల్లి మండలంలోని విట్టునాయక్​ తండా వద్ద వాహన తనిఖీలు (Vehicle inspections) చేపట్టారు. ఓ కారును ఆపి తనిఖీ చేయగా... పోలీసులు షాక్​ అయ్యారు. తనిఖీల్లో భాగంగా ఆపిన కారులో తుపాకీ సహా.. కత్తులు, బేస్​ బాల్​ బ్యాట్​ (deadly weapons)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కర్ణాటకలోని బీదర్​ పట్టణానికి చెందిన వారిగా (bidhr mob arrested) గుర్తించారు. వాహనంలో మారణాయుధాలు (deadly weapons) ఎందుకున్నాయంటూ ప్రశ్నించారు.

జాడి మల్కాపూర్​ జలపాతాలు... జహీరాబాద్​ ధర్మాసాగర్​ రోడ్డు నిర్మానుష్యంగా ఉంటుందని... అక్కడ ద్విచక్రవాహనంపై రాకపోకలు సాగించే దంపతులను (mob attacks on couple )దోచుకోవడమే లక్ష్యంగా వీరు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇటీవల కాలంలో దంపతులే లక్ష్యంగా సాగుతున్న దారుణాలు (mob attacks on couple ) చాలా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఏపీలోని గుంటూరు జిల్లాలో ఈ తరహా ఘటనే కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు నగరానికి 28 కి.మీ దూరంలో.. ఈ నెల 8న రాత్రి 10 గంటల సమయంలో వివాహితపై ఆగంతుకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దోపిడీ దొంగల ముఠా తరహాలో దారికాసి అటకాయించిన దుండగులు.. ఆలుమగలిద్దరినీ తీవ్రంగా కొట్టి, చిత్రహింసలు పెట్టారు.భర్తను కట్టేసి భార్యపై అఘాయిత్యానికి తెగబడ్డారు. వేటకొడవళ్లతో బెదిరించి నగలు, నగదు కూడా కాజేశారు. ఏపీ ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోని సీతానగరం పుష్కరఘాట్‌ వద్ద మూడు నెలల కిందట జరిగిన సామూహిక అత్యాచార ఘటన మరువకముందే.. అదే తరహా దారుణం అదే జిల్లాలో చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదే తరహాలో దోపిడి చేసేందుకే బీదర్​ నుంచి ఇక్కడకి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఎక్కడైనా ఇలాంటి దారుణాలకు పాల్పడ్డారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details