తెలంగాణ

telangana

ETV Bharat / crime

Honor Killing Case: 'రామకృష్ణను హత్య చేసేందుకు ఆర్నెళ్ల క్రితమే సుపారీ ఇచ్చాడు'

Honor Killing Case: భువనగిరిలో పరువు హత్య కేసులో రామకృష్ణను చంపేందుకు ఆర్నెళ్ల క్రితమే సుపారీ అందిందని పోలీసులు వెల్లడించారు. భార్గవికి కూతురు పుట్టడంతో.. వెంకటేశ్‌ హత్య ప్రయత్నంలో వెనక్కి తగ్గాడని పేర్కొన్నారు. అయితే రామకృష్ణ ఆస్తి కోసం బెదిరింపులు చేయడంతోనే అతడిని అంతమొందించాడని వివరించారు.

Honor Killing Case: 'రామకృష్ణను హత్య చేసేందుకు ఆర్నెళ్ల క్రితమే సుపారీ ఇచ్చాడు'
Honor Killing Case: 'రామకృష్ణను హత్య చేసేందుకు ఆర్నెళ్ల క్రితమే సుపారీ ఇచ్చాడు'

By

Published : Apr 18, 2022, 6:48 PM IST

Updated : Apr 18, 2022, 7:32 PM IST

Honor Killing Case: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో కలకలం రేపిన పరువు హత్య కేసులో 11మంది నిందితులను అరెస్టు చేసినట్లు భువనగిరి పోలీసులు వెల్లడించారు. మృతుడు రామకృష్ణను ఆయన మామే చంపించినట్లు పోలీసులు తేల్చారు. రామకృష్ణను చంపేందుకు ఆర్నెళ్ల క్రితమే సుపారీ అందిందని పోలీసులు వెల్లడించారు. భార్గవికి కూతురు పుట్టడంతో వెంకటేశ్‌ హత్య ప్రయత్నంలో వెనక్కి తగ్గాడని పేర్కొన్నారు. అయితే రామకృష్ణ ఆస్తి కోసం బెదిరింపులు చేయడంతోనే అతడిని అంతమొందించాడని వివరించారు.

10లక్షల సుపారీ: పరువు హత్య కేసులో పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు. అన్నా.. అన్నా.. అంటూ తనవెంట తిరిగి తన కూతురినే వివాహం చేసుకోవడం వెంకటేశ్‌ జీర్ణించుకోలేకపోయాడని తెలిపారు. భార్గవి, రామకృష్ణల మధ్య వయసులో అంతరం ఎక్కువ ఉండటం, ఆస్తిలో హెచ్చుతగ్గుల వల్ల.... రామకృష్ణపై వెంకటేశ్‌ కోపం పెంచుకున్నాడని వివరించారు. ఈ హత్య కోసం లతీఫ్​ రూ.10 లక్షలు సుపారీ మాట్లాడుకున్నాడని.. రూ.6 లక్షలు సుపారీ అందినట్లు లతీఫ్‌ చెబుతున్నాడని ఏసీపీ వివరించారు. వెంకటేశ్‌ సూచన మేరకు రామకృష్ణను చంపి లక్డారం కాలువలో పడేశానని తెలిపాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న లతీఫ్‌ కేవలం డబ్బుకోసమే హత్యకు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాలు, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.

హత్య కేసుకు సంబంధించి తోట్ల నరేందర్, తోట్ల ధనలక్ష్మి, తోట్ల భానుప్రకాశ్‌లను ఇవాళ అరెస్టు చేసినట్లు భువనగిరి ఏసీపీ వెల్లడించారు. వారి వద్ద నుంచి బొమ్మ పిస్టల్‌, రెండు కొడవళ్లు, ఒక సుత్తి, లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ చెప్పారు. ఒక ఇండికా కారు, రెండు ద్విచక్రవాహనాలు సీజ్‌ చేసినట్లు తెలిపారు. పోస్టుమార్టం పూర్తయ్యాక రామకృష్ణ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. కుటుంబీకులు రామకృష్ణ మృతదేహాన్ని వలిగొండ మండలం లింగరాజుపల్లి తరలించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి.

బెదిరించినందుకే చంపేశాడు: రామకృష్ణ హోంగార్డుగా సస్పెండ్​ అయిన తర్వాత యాదగిరిగుట్టలో వెంకటేశ్​ ఇంటి సమీపంలో ఉండేవాడు. ఈ క్రమంలో అన్న అన్న అనుకుంటూ వెంకటేశ్​ చుట్టూ తిరిగేవాడు. దీంతో రామకృష్ణను నమ్మి వెంకటేశ్​ ఇంట్లోకి రానిచ్చాడు. ఈ మధ్యలో వెంకటేశ్​ కూతురు భార్గవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దానిని వెంకటేశ్​ జీర్ణించుకోలేకపోయాడు. వారిద్దరి వయసుతో పాటు ఆర్థికం పరిస్థితుల్లో కూడా తేడా ఉంది. అప్పుడే సుపారీ ఇచ్చి హత్య చేయించాలనే ఆలోచన వెంకటేశ్​కు వచ్చింది. ఆరు నెలల క్రితమే చంపాలని సుపారీ ఇచ్చినా.. భార్గవికి కూతురు పుట్టడంతో హత్య ప్రయత్నంలో వెనక్కి తగ్గాడు. కానీ ఆస్తి గురించి ఎప్పుడైతే బెదిరించడం ప్రారంభించాడో అప్పుడు రామకృష్ణను చంపాలని నిర్ణయించుకున్నాడు. -వెంకట్​రెడ్డి, భువనగిరి ఏసీపీ

'రామకృష్ణను హత్య చేసేందుకు ఆర్నెళ్ల క్రితమే సుపారీ ఇచ్చాడు'

ఇవీ చదవండి:

Last Updated : Apr 18, 2022, 7:32 PM IST

ABOUT THE AUTHOR

...view details