తెలంగాణ

telangana

ETV Bharat / crime

మైనర్ బాలిక హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు - యువకుడికి జీవిత ఖైదు

Life imprisonment in rape case మైనర్ బాలికను హత్య చేసిన ఓ యువకుడికి భువనగిరి కోర్టు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 2017 మైనర్​ బాలికను హత్య చేసిన ఆ నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. దోషి రూ.10వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

Life imprisonment
Life imprisonment

By

Published : Aug 29, 2022, 10:02 PM IST

Life imprisonment in rape case: ఓ యువకుడికి కఠిన కారాగార శిక్ష విధిస్తూ భువనగిరి కోర్టు తీర్పు వెల్లడించింది. నిందితుడికి జీవిత ఖైదుతో పాటు... రూ.10వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన ఓ మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ ప్రేమ పేరుతో వేధించాడు. బాలిక సదరు విషయాన్ని ఇంట్లో తెలుపగా కుటుంబ సభ్యులు... గ్రామపెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. గ్రామపెద్దలు శ్రీకాంత్​ను చివాట్లు పెట్టి మరోసారి బాలిక విషయంలో కల్పించుకోవద్దని సూచించారు. దీంతో బాలికపై కక్ష పెంచుకున్న శ్రీకాంత్ సమయం కోసం ఎదురు చూశాడు.

2017 జూన్ 10న మైనర్ బాలిక ఇంటి చుట్టూ ద్విచక్ర వాహనంపై తిరిగిన శ్రీకాంత్... ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్న విషయాన్ని నిర్ధారించుకుని ఇంట్లోకి ప్రవేశించి పెళ్లి చేసుకోవాలని వేధించాడు. దానికి బాలిక నిరాకరించడంతో... తన వెంట తెచ్చుకున్న కత్తితో బాలిక ఛాతి, పొట్ట, ఎడమ చేతిపై పొడిచాడు. బాలిక కేకలు వేయడంతో సమీపంలో ఉన్న ఆమె సోదరుడు ఇంటికి వచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన శ్రీకాంత్ వెంటనే గోడ దూకి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావమైన బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన యాదగిరిగుట్ట పోలీసులు పక్కా సాక్ష్యాధారాలు సేకరించి భువనగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన కోర్టు సాక్ష్యులను విచారించిన తర్వాత శ్రీకాంత్​ను దోషిగా తెలుస్తూ తీర్పునిచ్చింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details