సైబర్ మోసగాళ్ల బారిన ఇప్పటి వరకు సామాన్యులే బాధితులుగా మిగులుతుండగా... తాజాగా సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు... నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. భీష్మ చిత్ర దర్శకుడు వెంకీ కుడుములను అవార్డులను పేరుతో ఓ ఆగంతుకుడు ఫోన్ చేసి... నమ్మించి మోసం చేశాడు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని.. ఏసీపీ ప్రసాద్ తెలిపారు. వెంకీ కుడుములకు డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్పొరేషన్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు నవీన్ కుమార్ అనే వ్యక్తి మాట్లాడారని.. భీష్మ చిత్రం 6 క్యాటగిరీలలో అవార్డ్స్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపాడన్నారు. ఒక్కో క్యాటగిరికి 10 వేల 600 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని... 6 క్యాటగిరీలకు గాను 63 వేల రూపాయలను అతను చెప్పిన ఖాతాకు బదిలీ చేయాలన్నారు.
అవార్డు పేరుతో సినిమా దర్శకుడికి టోకరా - telangana varthalu
సైబర్ మోసగాళ్లు సామాన్యులనే కాదు... చిత్ర దర్శకులను కూడా వదలడం లేదు. గతేడాది విడుదలైన హీరో నితిన్ నటించిన ‘భీష్మ’ చిత్ర దర్శకుడు వెంకట్ కుడుముల నుంచి సైబర్ దొంగలు రూ.63 వేలు కాజేశారు.
మళ్లీ అదే వ్యక్తి పోన్ చేసి... కొన్ని సాంకేతిక సమస్యలతో నగదు జమ కాలేదని.. మరోసారి 63 వేలు మొత్తం బదిలీ చేయాలని కోరాడన్నారు. దర్శకుడికి అనుమానం రావడంతో... నిర్మాతతో మాట్లాడి చేస్తానని సమాధానం ఇచ్చాడని.. 6 క్యాటగిరీలకు కాకున్నా.. మూడు లేదా ఒక క్యాటగిరీ లకైనా నగదు పంపాలని అడిగాడని తెలిపారు. దీంతో మోసపోయానని గ్రహించిన దర్శకుడు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని.. సైబర్ క్రైమ్స్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి: స్టేషన్‌ఘన్‌పూర్ వద్ద ధానాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం