మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. శ్రీరాంపూర్‌లో సింగరేణి కార్మికునిగా పనిచేస్తున్న రాజలింగం ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. ఇంట్లో బీరువాను పగలగొట్టి రూ.7 లక్షల నగదు, 11 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
పట్టపగలే చోరీ: ఆస్పత్రికి వెళ్లి వచ్చేలోపే దోచేశారు! - పట్టపగలే చోరీకి పాల్పడిన దుండగులు
చోరీలు చేసేందుకు రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇళ్లను గుల్ల చేస్తున్నారు. పట్టపగలే ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఇంట్లో బీరువాను పగలగొట్టిన దొంగలు రూ.7 లక్షల నగదు, 11 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో ఈ సంఘటన జరిగింది.
పట్టణంలోని విద్యానగర్‌లో నివాసముంటున్న రాజలింగం ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మంచిర్యాలలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండడం చూసి అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే జాగిలాలను రప్పించి తనిఖీలు చేపట్టిన ఎలాంటి లాభం లేకుండా పోయింది. స్థానిక ఎస్సై రవిప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నాారు. అనంతరం వేలిముద్రల నిపుణులను రప్పించి సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.