2018 సంవత్సరంలో ఓ మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా.. పూడ్చిపెట్టిన శవానికి పోలీసులు పంచనామా నిర్వహించారు. దర్యాప్తులో భాగంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మణుగూరు ఏఎస్పీ శబరీశ్ ఆధ్వర్యంలో... స్మశానవాటికలో పూడ్చిన శవ అవయవాలను ఫోరెన్సిక్ నిపుణుల సేకరించారు.
ఏం జరిగింది...?
ఇల్లందు పట్టణంలోని కాకతీయ నగర్‌కు చెందిన విజయ్ అలియాస్ శివ(27)ను 2018 సంవత్సరంలో గుర్తుతెలియని కొందరు వ్యక్తులు తీసుకెళ్లారు. విజయ్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఇల్లందు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక కేసులో విచారణ చేస్తున్న పోలీసులకు 2018 సంవత్సరంలో ఇల్లందులో హత్యచేసి పూడ్చిన విషయం తేలింది. ఈ విషయమై ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ శబరీశ్ తెలిపారు.
ఇదీ చూడండి:మైనర్‌పై 6 నెలలుగా ఏడుగురి అత్యాచారం