అరటి పండు తింటున్న వృద్ధురాలిపై తేనెటీగలు దాడి చేశాయి. ఆమెను కాపాడేందుకు వచ్చిన మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో జరిగింది.
మండల కేంద్రానికి చెందిన గజ్జవ్వ (70) జిల్లా కేంద్రంలో పనులు ముగించుకుని ఆటో దిగి బస్టాండ్ ప్రాంతంలో చెట్టు కింద అరటి పండ్లు తింటుండగా చెట్టుపై ఉన్న కోతులు పండ్ల కోసం ఆరాటపడుతూ చెట్టు కొమ్మలను గట్టిగా ఊపాయి. కొమ్మన ఉన్న తేనెతుట్టకదిలి తేనెటీగలు చెలరేగి వృద్ధురాలిపై దాడి చేశాయి. గజ్జవ్వను కాపాడేందుకు ప్రయత్నించిన వెంకటేశ్, శ్రీనివాస్పైన దాడి చేశాయి.