తెలంగాణ

telangana

ETV Bharat / crime

నకిలీ సీబీఐ ముఠా అరెస్టు - హైదరాబాద్​ తాజా వార్తలు

నకిలీ సీబీఐ ముఠాను హైదరాబాద్​ పేట్​ బషీరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. సీబీఐ అధికారులమంటూ ఈ నెల 1న ఓ ఇంట్లో ఈ ముఠా దాడికి పాల్పడగా... బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ముఠాలోని 19 మంది నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.

Bashirabad police arrest fake CBI gang in hyderabad
నకిలీ సీబీఐ ముఠాను అరెస్టు చేసిన బషీరాబాద్​ పోలీసులు

By

Published : Apr 18, 2021, 3:35 AM IST

సీబీఐ అధికారులమంటూ ఈ నెల 1వ తేదీన.. హైదరాబాద్ సుచిత్రలో నివాసముండే పద్మలత ఇంట్లో 19 మంది దాడి చేశారు. బ్లాక్ మనీ ఉందనే సమాచారం వచ్చిందంటూ ఆమెతో చెప్పి తనిఖీ చేశారు. సుమారు గంట పాటు వెతికినా... ఎలాంటి నగదు లభించకపోవడం వల్ల వెనుదిరిగారు. దాడిపై అనుమానం రాగా... వెంటనే పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పద్మలత తెలిపారు.

ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి పోలీసులు... నకిలీ సీబీఐ ముఠా సభ్యులంతా హైదరాబాద్​కు చెందినవారని గుర్తించారు. వీరిలో ఒకరు పాత నేరస్థుడు ఉన్నట్లు తెలిపారు. ఆమె భర్తకు ఓ రైస్​మిల్ ఉండడం వల్ల డబ్బు దొరుకుతుందని... పక్కా ప్రణాళికతో వారి ఇంటిపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. 19 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ABOUT THE AUTHOR

...view details