Basara IIIT Student Died: బాసర ఐఐఐటీలో చదువుతున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూర్ రంగెంపేటకు చెందిన సంజయ్ కిరణ్ (22) బాసర ఐఐఐటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల విషతూల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడిన సంజయ్.. కొంతకాలంగా హనుమకొండ రోహిణి, హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రుల్లో చికిత్స పొందాడు. వైద్యానికి దాదాపు 16 లక్షలు ఖర్చుచేసినా లాభం లేకపోయింది.
బాసర ఐఐఐటీ విద్యార్థి మృతి.. కలుషిత ఆహారం వల్లే..! - Basara IIIT latest news
Basara IIIT Student Died: బాసర ఐఐఐటీలో ఆహారం కలుషితమై అనారోగ్యం పాలైన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వరంగల్ జిల్లాకు చెందిన సంజయ్ కిరణ్ (22).. ఇటీవల విషతుల్యమైన ఆహారం తిని ఆస్పత్రి పాలయ్యాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఐఐటీలో ఆహారం విషతుల్యం కావటం వల్లే.. తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని సంజయ్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. లక్షలు ఖర్చుపెట్టినా తన కుమారున్ని కాపాడుకోలేకపోయామని సంజయ్ తండ్రి శ్రీధర్ గుండెలవిసేలా రోధించాడు. అయితే బాసర ట్రిపుల్‌ఐటీలో చేరక ముందే సంజయ్ అనారోగ్యం బారిన పడినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా.. సంజయ్ కిరణ్ మృతిపై గ్రామంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో జులై 15న మధ్యాహ్న భోజనం వికటించి 600 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు మధ్యాహ్నం ఎగ్‌ఫ్రైడ్ రైస్ కలుషితం కావడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పీయూసీ-1, పీయూసీ-2 విద్యార్థుల మెస్‌ల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇవీ చూడండి: