కారులో నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకెట్లను తరలిస్తున్న ముఠాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఘనపరం మండలం గాంధీనగర్ వద్ద కారులో నిర్వహించిన తనిఖీల్లో వీటిని గుర్తించారు. వాహనం సీజ్ చేసి, రూ. 10 లక్షల విలువ చేసే గుట్కా, అంబర్ ప్యాకెట్లు, రూ. 3.50 లక్షలు, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
రూ. 10 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా స్వాధీనం
నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్న నలుగురిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన గుట్కా విలువ రూ. 10 లక్షలు ఉంటుందని తెలిపారు.
నిషేధిత గుట్కా స్వాధీనం
అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వేర్వేరు జిల్లాలకు చెందిన ఈ నలుగురు కిరాణా షాపుల్లో వీటిని నిల్వ చేసి చుట్టు పక్కల గ్రామాలకు తరలిస్తారని పోలీసులు తెలిపారు. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:ఏటీఎం సిబ్బందిని తుపాకీతో కాల్చి చోరీ
Last Updated : Apr 29, 2021, 8:23 PM IST