తెలంగాణ

telangana

ETV Bharat / crime

పోలీసులు కూంబింగ్​లో పట్టుబడ్డ మిలీషియా సభ్యులు - కూంబింగ్​లో పట్టుబడ్డ మిలీషియా సభ్యులు

నిషేధిత సీపీఐ మావోయిస్టులో మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్న ఏడగురిని ములుగు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూంబింగ్​ నిర్వహిస్తున్న.. పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకొన్నారు. వారంతా కొంతకాలంగా మిలీషియాలో పనిచేస్తున్నట్టు ఎస్పీ సంగ్రామ్​ సింగ్​ గణపతి పాటిల్​ తెలిపారు.

banned maoist mileeshiya team members caught in police coombing
పోలీసులు కూంబింగ్​లో పట్టుబడ్డ మిలీషియా సభ్యులు

By

Published : Feb 23, 2021, 6:01 PM IST

Updated : Feb 23, 2021, 7:27 PM IST

పోలీసులు కూంబింగ్​లో పట్టుబడ్డ మిలీషియా సభ్యులు

ములుగు జిల్లాలో నిషేధిత సీపీఐ మావోయిస్టులో మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో... ఏటూర్​నాగారం, వెంకటాపూరం సీఐలు, ఎస్సైలు, బాంబ్​ డిస్పోజబుల్​ టీం, జీఆర్​పీఎఫ్​ బెటాలియన్​, స్పెషల్ టీం పోలీసులు సోమవారం మధ్యాహ్నం కూంబింగ్ నిర్వహించారు.

బాణాలు, టిఫిన్ బాంబులు, వైరు బిండల్స్​ పట్టుకొని వెళ్తున్న మిలీషియా సభ్యులను పోలీసులును చూడగానే పరుగెత్తారు. వారిని వెంబడించి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సంగ్రామ్​ సింగ్​ గణపతి పాటిల్ తెలిపారు. విచారించగా... కొంతకాలంగా మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నట్టు చెప్పినట్టు వెల్లడించారు.

నిందితులు వెంకటాపూర్ మండలం జల్లా గ్రామానికి చెందిన మిలిషియా కమాండర్ ఉండం పాండు, సది లక్ష్మయ్య అలియాస్ లక్మ, మడకం మాధవి, ఆడమయ్య, మాడవి ఐతయ్య, వెంకటాపూర్ మండల్ చెలిమెల గ్రామానికి చెందిన మాధవి ముద్ర, డిప్యూటీ మిలీషియా కమాండర్ ముక్కకి భీమయ్యగా పోలీసులు గుర్తించారు.

వీరిని విచారించి... క్లైమర్ మైన్స్ పెట్టిన ప్రదేశాన్ని వెతకగా... కార్డ్ ఎక్స్ వైరు 80 మీటర్లు, డిటోనేటర్ 50, వాకి టాకీ మాన్ ప్యాక్ 1, చెక్క డైరెక్షన్ మైండ్ బాంబు 1, నాలుగు విల్లంబులు, 8 బాణాలు, ఎలక్ట్రిక్ వైర్, బ్యాటరీస్, తయారు చేయించిన ఇనుప మొలలు, వేటకు సంబంధించిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వెల్లడించారు. నిందితులపై ఇంతకు ముందే పలు కేసులు నమోదైనట్టు తెలిపారు.

ఇదీ చూడండి:'ఎదురుదెబ్బలతో పోరాటలేకపోతున్నా' సెల్ఫీ వీడియోతో సూసైడ్​

Last Updated : Feb 23, 2021, 7:27 PM IST

ABOUT THE AUTHOR

...view details