పెద్దపల్లి జిల్లా గుంజపడుగులోని 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా'లో అర్ధరాత్రి జరిగిన చోరీ సంచలనం రేపుతోంది. న్యాయవాద దంపతుల హత్య అనంతరం.. గ్రామంలో పోలీస్ పికెటింగ్, పహారా పెంచామని అధికారులు చెబుతున్నా.. బ్యాంకు కిటికీ పగలగొట్టి, దుండగులు చోరీకి పాల్పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గుంజపడుగులో బ్యాంకు చోరీ.. హార్డ్ డిస్క్ మాయం - గుంజపడుగులో బ్యాంకు చోరీ
పెద్దపల్లి జిల్లా గుంజపడుగు గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. న్యాయవాద దంపతుల హత్య అనంతరం.. గ్రామంలో పోలీసు భద్రత పటిష్ఠంగా ఉన్నా.. అర్ధరాత్రి జరిగిన బ్యాంకు చోరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గుంజపడుగులో బ్యాంకు చోరీ.. హార్డ్ డిస్క్ మాయం
దొంగలు తెలివిగా సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌ను సైతం ఎత్తుకెళ్లారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. జాగిలాల సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకులోనికి ఎవరిని అనుమతించకుండా వేలిముద్రలు, ఇతర ఆధారాల కోసం వెతుకుతున్నారు. బ్యాంకు వెనుక భాగంలో నిచ్చెన వాడి చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:అప్పులకు బలైన రైతు కుటుంబం.. పరువు కోసం బలవన్మరణం