తెలంగాణ

telangana

ETV Bharat / crime

Sarayu Arrest: యూట్యూబర్​ సరయూ అరెస్ట్​.. ఎందుకంటే? - banjarahils police

Sarayu Arrest: యూట్యూబ్‌ నటి సరయూపై విశ్వ హిందూ పరిషత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ హోటల్‌ ప్రమోషన్‌లో హిందువులను కించపరిచారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వీహెచ్‌పీ అధ్యక్షుడు చేపూరి అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన సిరిసిల్ల ఠాణా ఇన్‌స్పెక్టర్‌.. బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు కేసు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్​ పోలీసులు సరయూను అదుపులోకి తీసుకున్నారు.

Sarayu Arrest:  యూట్యూబర్​ సరయూ అరెస్ట్​.. ఎందుకంటే?
Sarayu Arrest: యూట్యూబర్​ సరయూ అరెస్ట్​.. ఎందుకంటే?

By

Published : Feb 7, 2022, 10:29 PM IST

Sarayu Arrest: యూట్యూబర్‌ సరయూతో పాటు ఆమె బృందంపై బంజారాహిల్స్‌ పోలీసు ఠాణాలో కేసు నమోదైంది. ఈ మేరకు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ పూసపాటి శివచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సరయూ, ఆమె బృందం ‘7 ఆర్ట్స్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ‘7 ఆర్ట్స్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌’ కోసం లఘు చిత్రం రూపొందించి గతేడాది ఫిబ్రవరి 25న తన ఛానల్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఆ చిత్రంలో సరయూ, ఆమె బృందం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించారు.

వీడియో హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచే విధంగా ఉండటంతో పాటు మద్యం తాగి హోటల్‌కు వస్తారనే దుష్ప్రచారం అవుతోందని రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షులు చేపూరి అశోక్‌ అక్కడి ఠాణాలో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన సిరిసిల్ల ఠాణా ఇన్‌స్పెక్టర్‌.. బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలోని ఫిలింనగర్‌లో వీడియో చిత్రీకరించినట్లు గుర్తించి బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు కేసు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో యూట్యూబర్​ సరయూను బంజారాహిల్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details