తెలంగాణ

telangana

ETV Bharat / crime

హైదరాబాద్​లో వ్యాపారి కిడ్నాప్.. గంటల వ్యవధిలో నిందితుల అరెస్ట్ - Arrest of the accused who kidnapped the merchant in Hyderabad

ఓ వ్యాపారి కిడ్నాప్‌ కేసును హైదరాబాద్‌ బంజారాహిల్స్ పోలీసులు గంటల వ్యవధిలో చేధించారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించిన కిడ్నాపర్లను సాంకేతికత ఆధారంగా పట్టుకుని అరెస్టు చేశారు.

banjarahills police arrested the accused who kidnapped merchant in Hyderabad
బంజారాహిల్స్‌లో వ్యాపారిని అపహరించిన నిందితుల అరెస్టు

By

Published : Feb 26, 2021, 11:24 AM IST

హైదరాబాద్ బంజారాహిల్స్​లో అపహరణకు గురైన ఓ వ్యక్తిని పోలీసులు గంటల వ్యవధిలోనే గుర్తించారు. శ్రీనగర్ కాలనీలో నివసించే వ్యాపారి అమర్‌నాథ్ రెడ్డి.... గురువారం రాత్రి కారులో వెళ్తుండగా... ముగ్గురు వ్యక్తులు అమర్‌నాథ్‌ రెడ్డిని కిడ్నాప్‌ చేశారు.

వ్యాపారి భార్యకు ఫోన్‌ చేసి నాలుగు లక్షల రూపాయలు డిమాండ్‌ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే చెన్నైకి తీసుకెళ్లి హతమారుస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. వ్యాపారి భార్య బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు... సాంకేతికత ఆధారంగా కేవలం గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ల నుంచి అమర్‌నాథ్ రెడ్డిని సురక్షితంగా విడిపించారు. ముగ్గురు కిడ్నాపర్లను అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details