ఓ మేనమామ, ఆయన ముగ్గురు అల్లుళ్లు. నిజామాబాద్ నుంచి వచ్చారు. బొగ్గు వ్యాపారంలో పెట్టుబడి పెడితే ప్రతి నెల 5 శాతం లాభం ఇస్తామని నమ్మించారు. రూ.61.90 లక్షలు రాబట్టారు. లాభాలు ఇవ్వకపోడంతో బాధితుడొకరు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో వారి మోసాలు బయటపడ్డాయి. ఆ వివరాలను బంజారాహిల్స్ సీఐ పూసపాటి శివచంద్ర, ఎస్‌ఐ రవిరాజ్ వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా ముస్తయిద్ పురకు చెందిన సొహైల్ సలామ్‌తో పాటు అతని అల్లుళ్లు, ఎంటెక్ చదివిన మహ్మద్ అబ్దుల్ అహద్ సయీఫ్, బీటెక్ చదివిన మహ్మద్ అబ్దుల్ వాహబ్ సుబూర్ నిరుద్యోగులుగా ఉన్నారు. అనాస్ డిగ్రీ చదువుతున్నాడు. నలుగురు బొగ్గు వ్యాపారం(coal scam) పేరుతో ఫిబ్రవరిలో హకీంపేటకు వచ్చారు. ముంతాజ్ ట్రేడర్ చార్‌కోల్ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. పెట్టిన పెట్టుబడిపై ప్రతి నెల 5 శాతం లాభాలు ఇస్తామంటూ నమ్మించారు.
coal scam case: 3 నెలల్లో రూ. 61.90లక్షలు కొట్టేశారు! - తెలంగాణ వార్తలు
బొగ్గు వ్యాపారంలో పెట్టుబడి పెడితే నెల నెలా లాభం ఇస్తామని నమ్మబలికారు. నిజామాబాద్ నుంచి హకీంపేటకు వచ్చి బొగ్గు దందా షురూ చేశారు. ఆపై స్థానికుల నుంచి రూ.లక్షల్లో కొల్లగొట్టారు. పోలీసులు తీగలాగితే ఆ మేనమామ, అల్లుళ్ల డొంక కదిలింది. ఇంతకీ ఏం జరిగిందంటే...!
స్థానికులైన మీర్ ఫరాసత్ అలీ, అతని సోదరి నుంచి దాదాపు రూ.17.90లక్షలు, ఎంఎ.నయీం రూ.15లక్షలు, మహ్మద్ అబ్దుల్ రహీం ఖురేషీ రూ.7లక్షలు, షేక్ అమీర్ రూ.5లక్షలు, ఖమర్ ఖాన్ రూ.10లక్షలు, షేక్ అజీజ్ రూ.2.5లక్షలు, మహ్మద్ హబీబ్‌ల నుంచి రూ.4.5లక్షలు వసూలు చేశారు. కటికం శ్రీకాంత్ నుంచి స్విఫ్ట్ కారు, సయీద్ సిద్దిఖీ నుంచి యాక్టివా వాహనాన్ని తీసుకున్నారు. కొద్ది నెలలు మిర్ ఫరాసత్ అలీకి 5 శాతం లాభాలను ఇచ్చారు. ఇది చూసి మిగతా వారు పెట్టుబడి సొమ్మును అందించారు. దుకాణం తెరవకపోవడం, చరవాణి ఆపేయడంతో అనుమానంతో పెట్టుబడిదారులంతా 4వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం మహ్మద్ అబ్దుల్ వాహబ్ సుబూర్‌ను అరెస్ట్ చేశారు. కారు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారు. సయీఫ్ ఈ కేసులో ప్రధాన నిందితుడని, పెళ్లి పేరుతో ఓ యువతికి దగ్గరై, వ్యాపారం కోసమని రూ.10లక్షలు తీసుకొని మోసానికి పాల్పడ్డాడని, ఆమె కుటుంబ సభ్యులు నిజామాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:OLD MAN GANJA CASE: వృద్ధుడే.. కానీ ఆయన చేసే పని తెలిస్తే షాక్ అవుతారు!