తెలంగాణ

telangana

ETV Bharat / crime

డీకే అరుణ కుమార్తెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. ఏమైందంటే? - డీకే శృతి కేసు అప్డేట్స్

SC, ST Atrocity case On DK Aruna's daughter : భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు డీకే శ్రుతిరెడ్డి, వినోద కైలాస్‌లపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.

SC, ST Atrocity case On DK Aruna's daughter, dk shruthi reddy case
డీకే అరుణ కుమార్తెపై అట్రాసిటీ కేసు

By

Published : Feb 9, 2022, 5:39 PM IST

Updated : Feb 9, 2022, 7:32 PM IST

డీకే అరుణ కుమార్తెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. ఏమైందంటే?

SC, ST Atrocity case On DK Aruna's daughter : భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నాంపల్లి 3వ అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు డీకే శ్రుతిరెడ్డి, వినోద కైలాస్‌లపై కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌లో ఇంటి ప్రహారీగోడ నిర్మాణ పనులు చేపడుతుండగా.. తమను శ్రుతిరెడ్డి దూషించి బెదిరించినట్లు ఈలేశ్​ బాబు అనే వ్యక్తి తగు ఆధారాలతో కోర్టును ఆశ్రయించారు.

ఆయన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న కోర్టు... డీకే శ్రుతిరెడ్డిపై కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్‌ పోలీసులను ఆదేశించింది. డీకే శ్రుతిరెడ్డితో పాటు వినోద కైలాస్‌లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల వద్ద గంజాయి పెంపకం...

Last Updated : Feb 9, 2022, 7:32 PM IST

ABOUT THE AUTHOR

...view details