తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఒక్కరోజే 9 సెల్​ఫోన్లు కొట్టేశారు... 48 గంటల్లోనే పట్టుబడ్డారు.. - Cell Phones Theft Gang arrest in banjarahills

Cell Phones Theft Gang arrest: హైదరాబాద్​లో సెల్​ఫోన్​ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను బంజారాహిల్స్​ పోలీసులు అరెస్టు చేశారు. కేసును 48 గంటల్లోనే ఛేదించిన పోలీసులు.. నిందితుల నుంచి 9 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Cell Phones Theft Gang arrest
సెల్​ఫోన్ల దొంగలు అరెస్టు

By

Published : Jan 28, 2022, 12:48 PM IST

Cell Phones Theft Gang arrest: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ద్విచక్రవాహనంపై తిరుగుతూ వరుసగా సెల్‌ఫోన్‌లు లాక్కెళ్లిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సెల్‌ఫోన్ల దొంగతనాలు జరిగిన వెంటనే తీవ్రంగా పరిగణించి నిందితులను పట్టుకున్నామని పశ్చిమ మండలం డీసీపీ జోయెల్ డేవిస్ తెలిపారు. ఒక్కరోజులోనే 3 పీఎస్​ల పరిధిలో దుండగులు సెల్​ఫోన్​లు ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి 9 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

"సీసీ కెమెరాల సహాయంతో 48 గంటల్లోనే నిందితులను గుర్తించాం. బంజారాహిల్స్​లోని సింగాడికుంటకు చెందిన నలుగురిని అరెస్ట్​ చేశాం. మా పీఎస్​ పరిధిలో చోరీకి గురైన 6 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా గతంలో రాయదుర్గం పరిధిలోనూ 3 సెల్​ఫోన్ల కేసులో వీళ్లు నిందితులుగా ఉన్నారు. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నాం." - జోయెల్​ డేవిస్​, హైదరాబాద్​ వెస్ట్​జోన్​ డీసీపీ

గోల్కొండ ఠాణా పరిధిలో జరిగిన ఫోన్ దొంగతనం కేసులో సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించామని డీసీపీ వెల్లడించారు. ఫిర్యాదు అందిన 48 గంటల్లోనే వారిని పట్టుకున్నామని చెప్పారు. బంజారాహిల్స్ సింగాడికుంట బస్తీకి చెందిన మొహమ్మద్ ఖాజా పాషా, మొహమ్మద్ సబెలగ, షేక్ సోహైల్, పవన్ కుమార్‌ను అరెస్టు చేశామని జోయల్‌ డేవిస్‌ తెలిపారు.

ఇదీ చదవండి:కూలీలతో వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టి బొగ్గు లారీ బోల్తా.. ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details