తెలంగాణ

telangana

ETV Bharat / crime

అగ్నికి ఆహుతైన నాలుగెకరాల అరటి తోట.. ఆదుకోవాలంటున్న అన్నదాత - అగ్నికి ఆహుతైన నాలుగు ఎకరాల అరటి తోట

Fire at Banana Garden: ఏపీలోని కర్నూలు జిల్లా డోన్ మండలం గోసానిపల్లిలో నాలుగు ఎకరాల అరటి తోట ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి అయింది. ఈ ప్రమాదంలో దాదాపు 60 టన్నుల అరటి కాలి బూడిదైంది.

అగ్నికి ఆహుతైన నాలుగెకరాల అరటి తోట.. ఆదుకోవాలంటున్న అన్నదాత
అగ్నికి ఆహుతైన నాలుగెకరాల అరటి తోట.. ఆదుకోవాలంటున్న అన్నదాత

By

Published : Mar 14, 2022, 5:11 AM IST

అగ్నికి ఆహుతైన నాలుగెకరాల అరటి తోట.. ఆదుకోవాలంటున్న అన్నదాత

Fire at Banana Garden: ఏపీలోని కర్నూలు జిల్లా డోన్ మండలం గోసానిపల్లిలో నాలుగు ఎకరాల అరటి తోట ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. బాలరంగస్వామి అనే రైతు.. ఆరు లక్షలు అప్పు చేసి నాలుగు ఎకరాల్లో అరటి మొక్కలు నాటారు. రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటను సాగుచేశాడు. అయితే కోతకు వచ్చే సమయంలో తోటలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల రైతులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు విఫలయత్నం చేశారు.

చివరికి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే మంటలు వ్యాపించి దాదాపు 60 టన్నుల అరటి కాలి బూడిదయింది. సుమారు 12లక్షల విలువైన పంట నష్టపోయామని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతు బాలరంగస్వామి వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details