balintha died in hospital: జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత చనిపోయిందంటూ కుటంబ సభ్యులు ఆందోళనకు దిగారు. జిల్లాలోని రాయికల్ మండలం జగన్నథాపూర్ గ్రామానికి చెందిన మహేశ్వరి అనే గర్భిణి ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఆరోగ్యం క్షీణించి మృతి చెందింది.
ఆసుపత్రిలో బాలింత మృతి.. వైద్యులు నిర్యక్ష్యమే కారణం..! - జగిత్యాల జిల్లా వార్తలు
balintha died in hospital: జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. సరైన వైద్యం అందక ఓ బాలింత మృతి చెందింది. బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఆరోగ్యం క్షీణించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే వైద్యులు సరిగా పట్టించుకోకపోవడం వల్లే చనిపోయిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆసుపత్రికి వచ్చి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
balintha died in hospital
మృతి వార్త తెలుసుకున్న ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకుని వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్యనే మరో ఇద్దరు బాలింతలు మృతి చెందగా, తాజాగా మరో మహిళ మృతి చెందటంతో ముగ్గురు మృతి చెందినట్లైంది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని జిల్లా కలెక్టర్ రవికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీ చదవండి: