తెలంగాణ

telangana

ETV Bharat / crime

Balintha Died: ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింత మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన - baimsa in nirmal

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. తన కొడుకును తనివితీరా చూసుకోకుండానే తనువు (Balintha Died) చాలించింది. ప్రసవం తర్వాత 4 గంటల వ్యవధిలోనే బిడ్డకు తల్లి (Balintha Died) దూరమైపోయింది. ఈ విషాద ఘటన భైంసాలో చోటు చేసుకుంది. వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్లనే బాలింత మృతి (Balintha Died) చెందిందని.. మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు.

Balintha Died
బాలింత మృతి

By

Published : Nov 8, 2021, 12:14 PM IST

నిర్మల్ జిల్లా భైంసా ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేక బాలింత మృతి (Balintha Died) చెందిన ఘటన చోటుచేసుకుంది. కుబీర్ మండలం బెల్గం తండాకు చెందిన రేష్మకు ఆదివారం మధ్యాహ్నం పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే కుటుంబసభ్యులు బాలింతను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

రాత్రి ఒంటి గంట సమయంలో రేష్మకు సాధారణ ప్రసవమై.. మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం 4 గంటల వ్యవధిలోనే బాలింత మృతి (Balintha Died) చెందింది. వైద్యులు అందుబాటులో లేక పోవడం వల్లనే రేష్మ మృతి (Balintha Died) చెందిందని ఆరోపిస్తూ.. కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి సిబ్బంది సరిగా పట్టించుకోకపోవడం వల్లనే బాలింత మృతి (Balintha Died) చెందిందని ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట బైఠాయించి.. తమకు న్యాయం చేయాలని నిరసన చేపట్టారు.

ఇదీ చూడండి:పురిటినొప్పులతో వెళ్తే 22 లక్షల బిల్లు.. అయినా శిశువు మృతి, బాలింత పరిస్థితి విషమం

ABOUT THE AUTHOR

...view details