రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలోని మంచిరేవుల ఫామ్ హౌజ్ పేకాట కేసులో 29మందికి ఉప్పర్ పల్లి కోర్టు(Gambling in Farm house case) బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌కు మాత్రం న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. గుత్తా సుమన్‌ను పోలీసులు వారం రోజుల కస్టడీ కోరగా.. దీనిపై ఈ నెల 5వ తేదీన వాదనలు జరగనున్నాయి.
మంచిరేవులలోని ఓ ఫామ్ హౌజ్‌లో రెండు రోజుల క్రితం పేకాట ఆడుతున్న 30మందిని నార్సింగి పోలీసులు(Gambling in Farm house case) అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌పై ఇతర పోలీస్ స్టేషన్లలోనూ కేసులున్నాయి. గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పేకాట శిబిరం నిర్వహిస్తూ గుత్తా సుమన్ పోలీసులకు దొరికిపోయాడు. పంజాగుట్ట, కూకట్పల్లి పోలీస్ స్టేషన్లలోనూ గుత్తా సుమన్(Gambling in Farm house case)పై చీటింగ్ కేసులున్నాయి. వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రముఖులను అందులో భాగస్వాములను చేసి.. గుత్తా సుమన్ పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
కాయిన్ల రూపంలో