బహదూర్‌పురా ఎస్సై శ్రవణ్ కుమార్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు. గత నెల 17న మహమ్మద్ ముజీబ్ అనే వ్యక్తి తన కుమారుడు హతీఖ్ మొబైల్ తిరిగి ఇవ్వడానికి ఎస్సై శ్రవణ్ కుమార్ లంచం డిమాండ్ చేస్తునట్లు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీనిపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఎస్సై హతీఖ్ నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి ఏసీబీ అధికారులు లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బహదూర్‌పురా ఎస్సై - Bahadurpura SI caught by ACB
తప్పు జరగకుండా చూడాల్సిన పోలీసులే లంచాలకు ఆశపడి అవినీతి బాట పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ పాతబస్తీ బహదూర్‌పురా ఎస్సై శ్రవణ్ కుమార్ రూ.8 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకుని ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్సై శ్రవణ్ కుమార్
గత నెల 17న మహమ్మద్ ముజీబ్ అనే వ్యక్తి తన కుమారుడు హతీఖ్ మొబైల్ తిరిగి ఇవ్వడానికి ఎస్సై శ్రవణ్ కుమార్ లంచం డిమాండ్ చేస్తునట్లు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్రవణ్ కుమార్ హతీఖ్ మొబైల్ ఫోన్‌ని దగ్గర ఉంచుకుని రూ.10 వేలు డిమాండ్ చేశాడు. రూ.8 వేలకు బేరం కుదుర్చుకుని లంచం తీసుకుంటుండగా ఈరోజు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. - ఏసీబీ అధికారి
ఇవీ చదవండి:
Last Updated : Jan 13, 2023, 10:11 PM IST