భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం విజయలక్ష్మి నగర పంచాయతీ పరిధిలో.... సింగరేణి ఉపరితల గని విస్తరణ కోసం చేపట్టిన కందకం పనులను ప్రజా ప్రతినిధులు, స్థానిక నిర్వాసితులు అడ్డుకున్నారు. ఉపరితల గని పనులకు సంబంధించి ప్రజలకు అవగాహన చేయకుండా కందకం పనులు చేపట్టడంతో.... స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి సమాచారం ఇవ్వకుండా పనులు నిర్వహింటడం సరికాదన్నారు. తమ ప్రాంతంలో పీసా చట్టం ప్రకారం పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
'కందకం పనులు వెంటనే ఆపండి... లేదంటే..' - badradri kothagudem district news
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి ఉపరితల గని విస్తరణ కోసం చేపట్టిన కందకం పనులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. కందకం పనులను స్థానికులు, ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. ఆ పనులకు సంబంధించి సమాచారం అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

'కందకం పనులు వెంటనే ఆపండి... లేదంటే..'