హైదరాబాద్ బాచుపల్లిలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఓ మహిళ అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ దక్షిణ భారత ఛైర్ పర్సన్‌గా చెలామని అవుతూ తనకు భారీగా ఆస్తులున్నాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి 11 కోట్ల రూపాయలు కాజేసింది. బాచుపల్లిలో పక్కనే ఉండే విల్లాలో నివాసముంటున్న వీరారెడ్డి నుంచి వివిధ దశల్లో డబ్బు వసూలు చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు....నిందితురాలితో పాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గురుని అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదు, బంగారంతో పాటు సుమారు 46 డెబిట్, క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
నమ్మించి మోసం
కడప జిల్లాకు చెందిన శిరీష అలియాస్ స్మృతి సిన్హా... విలాసాలకు అలవాటు పడి మోసాలకు పాల్పడింది. ఇందుకోసం ఆమెతో సహజీవనం చేస్తున్న అదే జిల్లాకు చెందిన విజయ్‌కుమార్ రెడ్డి సహకారం తీసుకుంది. ఇద్దరు కలిసి పథకం ప్రకారం బాచుపల్లికి చెందిన వీరారెడ్డిని ట్రాప్ చేశారు. డెహ్రాడూన్‌లో ఐపీఎస్ శిక్షణ తీసుకుంటున్నానంటూ విజయ్‌కుమార్....అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం దక్షిణ భారత ఛైర్‌పర్సన్ అని స్మృతి సింహా... వీరా రెడ్డిని పరిచయం చేసుకున్నారు. తమకు భారీగా ఆస్థులు ఉన్నాయని నమ్మించారు. అనంతరం వీరారెడ్డి నుంచి పలు దఫాలుగా సొమ్ము కాజేసినట్లు డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
పరువుపోతుందని ఆత్మహత్య