వైద్యుల నిర్లక్ష్యంతో పదహారు రోజుల శిశువు మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా కేశరాజు పల్లి గ్రామానికి దంపతులకు మగ శిశువు జన్మించాడు. అనారోగ్యంతో ఉన్న బాబును బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.
వైద్యుల నిర్లక్ష్యం.. తీసింది పసివాడి ప్రాణం.! - వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి తాజా వార్తలు
పండంటి బిడ్డకు జన్మనిచ్చాననే సంతోషం ఆమెకు ఎంతో కాలం నిల్వలేదు. వైద్యుల నిర్వాకంతో పండంటి మగ బిడ్డకు పదహారు రోజుల్లోనే ఆయుష్షు తీరింది. ముద్దులొలికే చిన్నారిని విగత జీవిగా చూసిన ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు
రోదిస్తున్న తల్లి
శిశువుకు ఊపిరితిత్తుల సమస్య ఉందని గురువారం సాయంత్రం వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆ తర్వాత ముక్కు నుంచి రక్తస్రావం జరిగి బాబు మృతి చెందాడు. శిశువు మరణానికి గల కారణమేంటని అడిగితే డాక్టర్లు సమాధానం చెప్పడం లేదని బాధిత తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి:నిజామాబాద్‌లో ఏడేళ్ల బాలుడి హత్య