తెలంగాణ

telangana

ETV Bharat / crime

పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన బాబా.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు - fake baba news in hyderabad

Baba cheated a women in Hyderabad: ఎవరు ఏది చెప్పినా వినేవాళ్లు ఉన్నంత కాలం.. దొంగ బాబాలు రాజ్యం ఏలుతూనే ఉంటారు. వారి మాయమాటలు విన్నామంటే ఇక అంతే సంగతులు. హైదరాబాద్​లో ఓ మహిళ.. దొంగ బాబా మాటలు నమ్మి అతనితో పెళ్లికి సిద్ధమైంది. సీన్ కట్ చేస్తే.. సరిగ్గా పెళ్లి సమయానికి ఆ బాబా హ్యాండ్​ ఇచ్చి జంపవడంతో మోసపోయినట్లు తెలుసుకుంది.

Baba cheated on a girl in Hyderabad
పెళ్లి చేసుకుంటానని మహిళను మోసం చేసిన దొంగ బాబా

By

Published : Feb 12, 2023, 2:38 PM IST

Baba cheated a women in Hyderabad: హైదరాబాద్​ లంగర్​హౌస్ పోలీస్​స్టేషన్ పరిధిలో వివాహం చేసుకుంటానని చెప్పి ఓ దొంగ బాబా మహిళను మోసం చేశాడు. నిందితుడు పెళ్లి సమయానికి రాకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలికి కొన్ని రోజుల క్రితం ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమె బంధువులు ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరులో దర్గాకు తీసుకెళ్లారు.

అక్కడ ఉండే నిందితుడు హఫీజ్ పాషా బాబా వారికి తమ కూతురు కొన్ని రోజుల్లో చనిపోబోతుందని చెప్పాడు. దానికి పరిష్కార మార్గంగా నిందితుడు ఆ అమ్మాయిని తాను పెళ్లి చేసుకుని ఆమె ప్రాణాలు కాపాడుకుంటానని మాయ మాటలు చెప్పాడు. ఈ మాటలను నమ్మిన బాధితురాలి కుటుంబ సభ్యులు.. కొన్ని రోజుల తర్వాత పెళ్లికి సిద్ధమయ్యారు. తీరా పెళ్లి సమయానికి నిందితుడు రాకపోవడంతో హఫీజ్ పాషా బంధువులను విచారించగా అతని ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని చెప్పారు.

దీంతో బాధితురాలి బంధువులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్​కి వెళ్లి నిందితుడిపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో నిందితుడు ఇది వరకే చాలా పెళ్లిలు చేసుకున్నాడని.. అతనిపై దాదాపు 13 కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాలన్నీ అతని గురించి విచారించగా వెలుగులోకి వచ్చాయని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దొంగ బాబా కోసం గాలిస్తున్నారు.

నిందితుడు హఫీజ్ పాషా బాబా

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details