అప్పుల బాధతో మానసిక వేదనకు గురైన ఓ యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో దూకి తనువు చాలించాడు. వరంగల్‌కు చెందిన యువ నేత్ర వైద్యుడు రాజేశ్ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టి కనిపించకుండా పోయాడు. శుక్రవారం హుస్నాబాద్ లోని ఎల్లమ్మ చెరువు వద్ద అతని చెప్పులు, మొబైల్ లభ్యం కావడంతో పోలీసులు గాలించినా మృతదేహం లభ్యం కాలేదు.
Suicide: సూసైడ్ నోట్ రాసి... యువ వైద్యుడు ఆత్మహత్య - వైద్యుడు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక మానసిక క్షోభకు గురైన వైద్యుడు తనువు చాలించాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
యువవైద్యుడు ఆత్మహత్య
శనివారం ఉదయం చెరువులో రాజేశ్ మృతదేహం పైకి తేలడంతో పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొద్ది రోజులుగా హుస్నాబాద్‌లోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో నేత్ర వైద్యుడిగా పని చేస్తున్నారు. అదే ఆస్పత్రిలో అతను రాసిన సూసైడ్ నోట్ లభించింది. అమ్మ నన్ను క్షమించుఅందులో..నా చావుకు ఎవరూ బాధ్యులు కాదని మానసిక సమస్యలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాజేశ్ లేఖలో పేర్కొన్నాడు.