harassment on women: ఒక యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రబుద్ధుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. భూపాల్‌పల్లి జిల్లా కటారం గ్రామానికి చెందిన దానం సాయి కృష్ణ(21) డిగ్రీ చదుతున్నాడు. ఇటీవల సోదరుడి ఇంట్లో జరిగిన బారసాల (ఊయల) వేడుకకు వెళ్లాడు. అదే కార్యక్రమానికి ఓ యువతి హాజరైంది. ఆ యువతిని ఏదో విధంగా లోబరచుకోవాలని నిందితుడు పథకం వేశాడు.
harassment on women: నగ్నంగా వీడియో కాల్ చేస్తావా..లేదా! - jayashanker bhupalapally crime news
harassment on women: పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. కోర్టులు కఠిన శిక్షలు విధిస్తున్నా.. మహిళలపై వేధింపులు ఆగడం లేదు. నిందితుల్లో బంధువులు, స్నేహితులు సైతం ఉంటున్నారు. బాత్రూంలో ఓ యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసి ఆమె సమీప బంధువే బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లాలో జరిగింది.
ఆమె బాత్రూంలో స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్ ద్వారా రహస్యంగా వీడియో, ఫొటోలు తీశాడు. కొద్దిరోజుల తరువాత తాను తీసిన వీడియో/ఫొటోలను యువతికి వాట్సాప్ చేశాడు. అదే వాట్సాప్ నంబర్‌తో ఫోన్ చేసి.. తనతో నగ్నంగా వీడియోకాల్ మాట్లాడాలని ఒత్తిడి చేశాడు. తన మాట వినకుంటే వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తానంటూ బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో రాచకొండ సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.రాము దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వేధింపులకు పాల్పడుతున్న యువకుడు బాధితురాలికి దగ్గరి బంధువుగా నిర్ధారించారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసినట్టు రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ వెల్లడించారు.
ఇదీచూడండి: