ఆటోను ద్విచక్ర వాహనం ఢీకొట్టగా.. ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ వద్ద జరిగింది.
మర్కుక్ మండలం పాతూరు గ్రామానికి చెందిన మహంకాళి సతీశ్(24) తన ద్విచక్ర వాహనానికి సంబంధించిన ఫైనాన్స్ డబ్బులను చెల్లించడానికి తూప్రాన్ వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన మిత్రుడు హరీశ్నూ తీసుకెళ్లాడు. తిరిగి వస్తుండగా మార్గమధ్యలో తూప్రాన్-గజ్వేల్ రహదారిపై కోమటిబండ వద్ద గ్రామం నుంచి హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఆటోను సతీశ్ ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది.