తెలంగాణ

telangana

ETV Bharat / crime

INDEPENDENCE DAY: ఓ వైపు స్వాతంత్ర్య వేడుకలు.. మరోవైపు బెల్టుషాపు వేలం - మద్యం దుకాణం వేలం పాటు

గ్రామంలో బెల్టు షాపు కేటాయించేందుకు వేలం పాట నిర్వహిస్తున్నారు.. ఆసక్తి ఉన్నవారు పాల్గొనండి. ఎక్కవ మొత్తానికి పాడినవారు ఏడాదిపాటు దర్జాగా నిర్వహించుకోవచ్చు. ఓ గ్రామంలో వ్యక్తి డప్పు కొడుతూ చెప్పాడు. అదీ కూడా ఆగస్టు 15వ తేదీన. ఇంతకీ అసలు కథ ఏంటి?

INDEPENDENCE DAY
బెల్టు షాపు నిర్వహించేందుకు వేలం

By

Published : Aug 16, 2021, 12:01 PM IST

నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో ఆదివారం (ఆగస్టు 15వ తేదీన) వేలం పాట జరిగింది. ఏదో స్థలానికి జరిగింది అనుకుంటే అది పొరపాటే. మద్యం దుకాణం నిర్వహణ కోసం ఈ వేల జరిగింది. గ్రామసర్పంచ్​ చొరవతోనే ఈ కార్యక్రమం జరగడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెల్టు షాపు నిర్వహించేందుకు వేలం

పోల్కంపల్లి గ్రామంలోని సర్పంచ్ కడారి శ్రీనివాస్ యాదవ్ శనివారం బెల్టుషాపుల వేలం గురించి డప్పు వేయించాడు. ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న శ్రీనివాస్​.... అనంతరం స్వయంగా మద్యం దుకాణం వేలం పాట నిర్వహించాడు. కనీసం స్వాతంత్య్ర దినోత్సవం రోజు అని కూడా లేకుండా.. వేలం నిర్వహించటం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా నిర్వహించే కార్యక్రమమే అయినా... కనీసం పంద్రాగస్టు రోజు వాయిదా వేయాల్సిందంటూ వాపోయారు.

వేలం వేసినా... లెక్కలు చెప్పట్లేదు.

కడారి శ్రీనివాస్​ సర్పంచ్​గా బాధ్యతలు చేపట్టి మూడు సంవత్సరాలైందని... రెండు సార్లు వేలం నిర్వహించగా.. మొదటి సారి 1,76,000... రెండో సంవత్సరంలో 2,23,000 రూపాయలు వచ్చాయని తెలిపారు. కనీసం ఒక్కసారి కూడా గ్రామానికి డబ్బుల లెక్క చూపకుండా... మూడో సారి వేలం వేస్తున్నాడని... గ్రామస్తులు శ్రీనివాస్​ను నిలదీశారు. గ్రామంలో బెల్టు షాపు నిర్వహించడానికి వీలు లేదంటూ మహిళలు పెద్ద ఎత్తున గొడవ చేశారు. మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని వాపోయారు.

మద్యం దుకాణం వేలం సమయంలో వచ్చిన డబ్బులను గ్రామంలో చండీయాగం, బోడ్రాయి వంటి కార్యక్రమాలకు వాడినట్లు సర్పంచ్ వెల్లడించారు. దేవాలయాల నిర్మాణానికి సైతం ఖర్చు చేశానని పేర్కొన్నారు. ఇలా వేలంలో వచ్చిన డబ్బును గ్రామాభివృద్ధికి వాడుతున్నట్లు శ్రీనివాస్​ తెలిపారు. ఈ బెల్టుషాపు వేలం వ్యవహారం తమ దృష్టికి రాలేదని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:ARK REDDY: దేశంలోకి చొరబడి దాడులు చేసే అవకాశం ఉంది..!

ABOUT THE AUTHOR

...view details