Attender Cheated the Lady: ఉద్యోగం పేరిట నగదు తీసుకుని యువతిని మోసం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుంతకల్లులో వెలుగులోకి వచ్చింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా తిప్పేస్వామి అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.2 లక్షలు తీసుకుని మోసం చేశాడని.. పట్టణానికి చెందిన లోకేశ్వరి పోలీసులను ఆశ్రయించింది.
కొంతకాలం నుంచి బాధిత యువతి.. తిప్పేస్వామిని చరవాణిలో సంప్రదించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించింది. దీంతో కసాపురం పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసిన తిప్పేస్వామి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పింది. తాను ఇచ్చిన నగదును తిరిగి ఇప్పించాలని కోరింది. దీనిపై కేసు నమోదు చేసుకొని చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.