Theft attempt in apartment : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని శ్రీలక్ష్మి అపార్టుమెంట్లో దొంగలు చోరీకి విఫలం యత్నం చేశారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక... అపార్టుమెంట్ గోడ దూకి ముగ్గురు దుండగులు ప్రవేశించారు. అక్కడినుంచి మూడు ఫ్లోర్లలో బీభత్సం సృష్టించారు. ఒక ఫ్లోర్‌లోని మూడు ఇళ్ల తాళాలు పగలగొట్టి... అందులోకి వెళ్లి చూశారు. విలువైన సామగ్రి లేకపోవడంతో తిరిగివెళ్లినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
Theft attempt in apartment: అపార్టుమెంట్లో చోరీకి విఫలయత్నం.. ఏం చేశారంటే? - తెలంగాణ వార్తలు
Theft attempt in apartment : ఆర్మూర్‌లోని ఓ అపార్టుమెంట్లో దొంగలు చోరీకి యత్నించారు. అర్ధరాత్రివేళ గోడ దూకి బీభత్సం సృష్టించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి.
అపార్టుమెంట్లో చోరీకి విఫలయత్నం
Theft CCTV Visuals : సోమవారం ఉదయం ఇది గమనించిన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. గతంలోనూ పలు అపార్టుమెంట్లలో దొంగలు చోరీకి పాల్పడిన ఘటనలు ఉన్నాయి. కాగా రాత్రివేళ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని అపార్టుమెంట్ వాసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:Fake Raids: సీబీఐ అధికారులమంటూ మోసం.. 1,340 గ్రాముల బంగారం, డబ్బు స్వాహా!
Last Updated : Dec 14, 2021, 3:15 PM IST