తెలంగాణ

telangana

ETV Bharat / crime

నేరెడ్​మెట్​లో ఏటీఎంల చోరీకి విఫలయత్నం​ - Attempted ATM theft news

మల్కాజిగిరి నేరెడ్​మెట్ క్రాస్‌రోడ్‌లోని ఏటీఎంలలో నగదు తస్కరించేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. యంత్రాలను పాక్షికంగా ధ్వంసం చేశారు. ఆకతాయిలు చేసినపని కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

నేరెడ్​మెట్​లో ఏటీఎంల చోరీకి విఫలయత్నం​
నేరెడ్​మెట్​లో ఏటీఎంల చోరీకి విఫలయత్నం​

By

Published : Feb 16, 2021, 12:17 PM IST

మేడ్చల్​ జిల్లా మల్కాజిగిరి నేరెడ్​మెట్ క్రాస్‌రోడ్‌లోని ఏటీఎంలలో దొంగతనం చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. పంజాబ్ నేషనల్, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో చోరీకి యత్నించారు. నగదు యంత్రాలు పాక్షికంగా ధ్వంసం చేశారు.

బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లతో దర్యాప్తు చేపట్టారు. ఏటీఎంలలో డబ్బులు చోరీ జరగలేదని.. ఆకతాయిలు చేసినపని కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details