Movie style theft in nellore: ఐటీ అధికారులమని చెప్పి భారీ దోపిడీకి యత్నించిన కేటుగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు నగరంలోని చిన్నబజార్ కాకర్ల వారి వీధిలోని లావణ్య జ్యువెల్లరీ దుకాణంలోకి శుక్రవారం ఐటీ అధికారులమంటూ ఆరుగురు వ్యక్తులు ప్రవేశించారు. తనిఖీలు చేయాలంటూ దుకాణంలో హడావిడి చేశారు. లెక్కల్లో కంటే ఎక్కువ బంగారం ఉందని 12 కిలోల బంగారం మూటకట్టుకుని పరారయ్యేందుకు యత్నించారు.
వారి తీరుపై అనుమానం వచ్చిన దుకాణం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పరారయ్యేందుకు ప్రయత్నించిన దొంగలను స్థానికుల సహకారంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టపగలే అధికారుల పేరు చెప్పి భారీ దోపిడీకి యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.