తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఒంటరిగా ఉన్న గర్భిణిపై కత్తితో బెదిరించి లైంగికదాడికి యత్నం.. - ts news

Sexual Harassment: కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. చిన్నారుల నుంచి ముసలివాళ్ల వరకు ఎవరిని వదలడం లేదు. చివరికి నిండు గర్భిణీలపై కూడా దారుణాలకు ఒడిగడుతున్నారు. అలాంటి ఘటనే యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. ఒంటరిగా ఉన్న 6 నెలల గర్భిణిపై కత్తితో బెదిరించి లైంగిక దాడికి ప్రయత్నించాడు ఓ ప్రబుద్ధుడు.

ఒంటరిగా ఉన్న గర్భిణిపై కత్తితో బెదిరించి లైంగికదాడికి యత్నం..
ఒంటరిగా ఉన్న గర్భిణిపై కత్తితో బెదిరించి లైంగికదాడికి యత్నం..

By

Published : Apr 13, 2022, 5:33 PM IST

Sexual Harassment: పరిచయస్తులే కదా.. అనే నమ్మకంతో ఉంటే అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. స్నేహితులే కదా అని చనువిస్తే కామాంధుల్లా మారి కాటేస్తున్నారు. చిన్నారుల నుంచి ముసలివాళ్ల వరకు ఎవరిని వదలడం లేదు. చివరికి నిండు గర్భిణీలపై కూడా దారుణాలకు ఒడిగడుతున్నారు. అలాంటి ఘటనే యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. భర్త రాత్రి విధులకు వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న 6 నెలల గర్భిణిపై కత్తితో బెదిరించి లైంగిక దాడికి ప్రయత్నించాడు ఓ ఇంటి యజమాని.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లోని కాటమయ్య కాలనీలో ఓ అద్దె ఇంట్లో భార్యాభర్తలు నివాసముంటున్నారు. భార్యాభర్తలిద్దరూ దివీస్​ కంపెనీలో పనిచేస్తున్నారు. భర్త రాత్రి విధుల కోసం వెళ్లగా.. గమనించిన ఇంటి యజమాని గంపల వెంకటరెడ్డి(62).. ఒంటరిగా ఉన్న మహిళపై రాత్రి 9గంటల సమయంలో కత్తితో బెదిరించి ఓ గదిలోకి లాక్కెళ్లాడు. తన లైంగిక వాంఛ తీర్చాలని కత్తితో బెదిరించాడు. వెంటనే తేరుకున్న మహిళ అతడిని ప్రతిఘటించి.. పక్కకు నెట్టివేసింది. బయటకు పరుగెత్తి గట్టిగా కేకలు వేసింది. ఇంటి యజమాని భార్యను గట్టిగా పిలవడంతో ఆమె బయటకు వచ్చి తన భర్తను ఇంట్లోకి తీసుకెళ్లింది. బాధితురాలు ఈ విషయాన్ని డ్యూటీకి వెళ్లిన భర్తతో పాటు స్థానికంగా ఉన్న సోదరుడికి ఫోన్​ చేసి తెలపగా.. వారు డయల్​ 100కు ఫోన్​ చేసి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలి భర్త ఇచ్చిన పిటిషన్​ ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు చౌటుప్పల్​ సీఐ శ్రీనివాస్​ వెల్లడించారు. ఆరు నెలల గర్భిణి అని చూడకుండా తన లైంగిక వాంఛ తీర్చమని అడిగిన ఇటువంటి వ్యక్తికి సరైన శిక్ష పడాలని బాధితురాలి భర్త డిమాండ్​ చేశారు.

సరైన శిక్ష పడాలి.. నేను నైట్​ షిఫ్ట్​ డ్యూటీకి వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న నా భార్యపై ఇంటి యజమాని వెంకటరెడ్డి కత్తితో బెదిరించి లైంగిక దాడికి యత్నించాడు. దీనిని ప్రతిఘటించి నా భార్య బయటకు వచ్చి మాకు ఫోన్​ చేయడంతో మేము వెంటనే డయల్​ 100కు ఫిర్యాదు చేశాం. వెంటనే స్పందించిన పోలీసులు రాత్రి సమయంలో ఇంటికి వచ్చి ఉదయం స్టేషన్​కు రమ్మని తెలిపారు. ఇచ్చిన పిటిషన్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులకు కృతజ్ఞతలు. నేను నా భార్య ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం. లైంగిక వాంఛ తీర్చమని అడిగిన ఇటువంటి వ్యక్తికి సరైన శిక్ష పడాలి. ఒకవేళ ఆ రాత్రి సమయంలో నా భార్యను కత్తితో వెంకటరెడ్డి చంపితే ఆ నింద నాపై మోపేవారు. -బాధితురాలి భర్త

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details