తెలంగాణ

telangana

ETV Bharat / crime

గంజాయి నిల్వలపై దాడులు.. ఇద్దరు అరెస్ట్​ - telangana crime news

గంజాయి నిల్వచేశారన్న సమాచారంతో ఆబ్కారీ పోలీసులు దాడులు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మండలానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ganja seized
గంజాయి నిల్వలపై దాడులు.. ఇద్దరు అరెస్ట్​

By

Published : Mar 21, 2021, 11:37 AM IST

గంజాయి సరఫరా చేస్తున్న ముఠాపై సంగారెడ్డి జిల్లా ఆబ్కారి శాఖ దాడులు చేసింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుంది. 6.5 కిలోల ఎండు గంజాయి, కారు, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మండలం బొమ్మనకుంటకు చెందిన సురేశ్​ కుమార్​ వర్మ.. తన ఇంటిలో గంజాయి నిల్వ చేసి విక్రయిస్తున్నాడనే సమాచారం ఆబ్కారీ శాఖకు అందింది. ఈ నెల 20న ఆబ్కారీ సీఐ సీతారామిరెడ్డి, ఎస్సైలు వెంకటేష్, స్వపులు తమ సిబ్బందితో దాడులు చేశారు.

సురేశ్​ కుమార్​ వర్మ ఇచ్చిన సమాచారంతో.. పటేల్​గూడ గ్రామానికి చెందిన శ్రీనివాస జాదవ్​ను.. ఆబ్కారీ పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం నిందితులిద్దరిని రిమాండ్​కు తరలించారు.

ఇవీచూడండి:అమ్మను చూడటానికెళ్లి అదృశ్యమైన బాలిక.. ఆచూకీ లభ్యం

ABOUT THE AUTHOR

...view details