Brutal Murder IN Kurnool District: ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కోడుమూరులో ఫ్యాక్షన్ కలకలం రేపింది. కేంద్ర మాజీ మంత్రి, తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ముఖ్య అనుచరుడైన కున్నూరు సిద్దప్పను దుండగులు హత్య చేశారు. కోడుమూరులో తన ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా దుండగులు కాపుకాసి.. వేట కొడవళ్లతో విచక్షణారహితంగా మెడ, తలపై దాడి చేశారు. దీంతో సిద్ధప్ప అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్న సిద్ధప్పను కుటుంబసభ్యులు, స్థానికులు అంబులెన్సులో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సిద్ధప్ప మృతి చెందాడు. 2008లో జరిగిన తెదేపా నేత కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు హత్య కేసులో సిద్ధప్ప ముద్దాయిగా ఉన్నాడు. పాత కక్షలే సిద్ధప్ప హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.