తెలంగాణ

telangana

ETV Bharat / crime

వైకాపా అరాచకాలు.. మరో తెదేపా నాయకుడిపై గొడ్డళ్లతో దాడి - పల్నాడు జిల్లా అలవలలో తెదేపా నాయకుడిపై హత్యాయత్నం

Attack on TDP leader: ఆంధ్రప్రదేశ్​లో వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. నిత్యం ఏదో ఓ చోట తెదేపా నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో తెదేపా నాయకుడిపై హత్యాయత్నం జరిగింది. వాకింగ్‌కు వెళ్తున్న సమయంలో.. తెదేపా నేతపై ప్రత్యర్థులు గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డ దారుణ ఘటన.. పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది.

attack on tdp leader
వైకాపా అరాచకాలు.. మరో తెదేపా నాయకుడిపై గొడ్డళ్లతో దాడి

By

Published : Jul 19, 2022, 1:28 PM IST

Attack on TDP leader: ఏపీ పల్నాడు జిల్లాలో మరో తెదేపా నాయకుడిపై హత్యాయత్నం జరిగింది. రొంపిచెర్ల మండల తెదేపా అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు గొడ్డళ్లతో దాడి చేశారు. అలవలలో వాకింగ్‌కు వెళ్తున్న బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థుల దాడికి పాల్పడగా.. తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయనను నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

వైకాపా అరాచకాలు.. మరో తెదేపా నాయకుడిపై గొడ్డళ్లతో దాడి

జగన్ ప్రోత్సాహంతోనే రెచ్చిపోతున్నారు:ఏపీ సీఎం జగన్ ప్రోత్సాహంతోనే హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని తెేదపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా నుంచి కూడా ప్రతీకార చర్యలు ఉంటే బాధ్యత జగన్ తీసుకుంటారా? లేక పోలీసులా అని ప్రశ్నించారు. బాలకోటిరెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపిన ఆయన.. శాంతిభద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయని మండిపడ్డారు. జగన్ ప్రోత్సాహంతోనే వైకాపా కార్యకర్తలు రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. బాలాకోటిరెడ్డికి ఏం జరిగినా జగన్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని తెలిపారు.

రాజ‌కీయ ఆధిప‌త్యం కోసమే హత్యలు..బాలకోటిరెడ్డిపై దాడిని తెదేపా నేతలు ఖండించారు. హ‌త్యలు, దాడుల‌తో తెదేపా కేడ‌ర్‌ని భ‌య‌పెట్టాల‌నుకుంటున్న జ‌గ‌న్ రెడ్డికి శిశుపాలుడిలా పాపాలు పండిపోయాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ప్రజావ్యతిరేక‌త తీవ్రం కావ‌డంతో, రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం చేయిస్తోన్న హ‌త్యలు, దాడులే వైకాపా ప‌త‌నానికి దారులని మండిపడ్డారు. బాల‌కోటిరెడ్డికి ఏమైనా జ‌రిగితే వైకాపా స‌ర్కారుదే బాధ్యత అని అన్నారు.

దాడిలో ఏకంగా వైకాపా ఎంపీపీ భ‌ర్త పాల్గొన్నాడంటే..ఆ పార్టీ రౌడీమూక‌లు ఎంతకు దిగజారాలో అర్థం అవుతోందని లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక‌నైనా హ‌త్యారాజ‌కీయాలు, దాడులు ఆపాలని, లేదంటే ఇంత‌కి నాలుగింత‌లు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా వుండాలని హెచ్చరించారు. తాము తిర‌గ‌బ‌డితే, వారి వెంట వ‌చ్చేది ఎవ‌రు, వైకాపా అధికారం కోల్పోతే కాపాడేదెవ‌రని లోకేశ్‌ నిలదీశారు.

మృగాల కంటే హీనం.. జగన్ రెడ్డి ప్యాక్షన్ భావాల్ని నరనరనా నింపుకున్న వైకాపా కార్యకర్తలు మృగాల కంటే హీనంగా ప్రవరిస్తున్నారని.. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రతి రోజూ సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికార మదంతో తెదేపా కార్యకర్తలపై దాడులు చేస్తున్న వైసీపీ రౌడీమూకల్ని హెచ్చరిస్తున్నామన్నారు.

తెదేపా ప్రభుత్వం వచ్చాక వైకాపా గుండాలకు ప్రత్యేకంగా కంటికి కన్ను, పంటికి పన్ను అనే పథకం అమలు చేస్తే మీ పరిస్థితి ఏంటని ధ్వజమెత్తారు. మీరు చేసే ప్రతి అరాచకానికి కర్మఫలం ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details