ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో దారుణం జరిగింది. బార్లో యువకుల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో మధు అనే యువకుడిపై ఓ వ్యక్తి బీర్ సీసాతో దాడి చేశాడు. ఘర్షణలో మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
యువకుడిపై బీరు సీసాతో దాడి.. ఒకరి పరిస్థితి విషమం - బార్లో యువకుల మధ్య ఘర్షణ
బార్లో యువకుల మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దిగి ఓ యువకుడిపై బీరు సీసాతో దాడి చేసిన ఘటన... ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో జరిగింది. ఘర్షణలో మరో వ్యక్తి గాయపడగా... ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
బార్లో యువకుల మధ్య ఘర్షణ
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించగా... మధు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను కర్నూలుకు తరలించారు. ఘర్షణకు కారణమైన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: తల్లిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు