తెలంగాణ

telangana

ETV Bharat / crime

విచారణకు వెళ్లిన పోలీసుల వాహనంపై రాళ్ల దాడి - Attack on police at hasakothuru

నిజామాబాద్​ జిల్లా హాసాకొత్తూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ యువకుడి మృతి కేసు దర్యాప్తునకు వెళ్లిన పోలీసులపై బాధిత కుటుంబం, బంధువులు దాడికి దిగారు. పోలీస్​ వాహనంపై రాళ్ల దాడి చేశారు. దాడిలో వాహనం ధ్వంసమైంది.

హాసాకొత్తూరులో పోలీసులపై దాడి
హాసాకొత్తూరులో పోలీసులపై దాడి

By

Published : May 21, 2021, 2:29 PM IST

Updated : May 21, 2021, 4:06 PM IST

హాసాకొత్తూరులో పోలీసులపై దాడి

నిజామాబాద్ జిల్లా కమ్మర్​పల్లి మండలం హాసాకొత్తూరులో ఉద్రిక్తత నెలకొంది. మాలావత్​ సిద్ధార్థ అనే యువకుడి మృతి కేసు దర్యాప్తునకు వెళ్లిన పోలీసులపై.. బాధిత కుటుంబం, బంధువులు దాడి చేశారు.

సిద్ధార్థ అనే వ్యక్తి.. గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గ్రామానికి చెందిన కనకం రాజేశ్ అనే యువకుడే దీనికి కారణమంటూ.. బాధిత కుటుంబం నిన్న ఆందోళనకు దిగింది. గ్రామానికి చేరుకున్న పోలీసులు.. వారిని చెదరగొట్టారు.

యువకుడి మృతిపై పోలీసులు ఇవాళ విచారణకు వెళ్లగా.. బాధిత కుటుంబం వారిని అడ్డుకుంది. సిద్ధార్థ మృతికి కారణమైన వ్యక్తిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారంటూ వారి వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఘటనలో వాహనం ధ్వంసం కాగా.. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత కథనం: హాసకొత్తూర్​లో యువకుడు అనుమానాస్పద మృతి..!

Last Updated : May 21, 2021, 4:06 PM IST

ABOUT THE AUTHOR

...view details