సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సెలవులో ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లతో స్థానికులు ఘర్షణకు దిగారు. మద్యం సేవించి అనుచితంగా మాట్లాడుతున్నారంటూ కానిస్టేబుళ్లపై దాడి చేశారు. పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఏం జరిగిందంటే..
పట్టణంలోని ఓ మద్యం దుకాణం పక్కన రోడ్డుపై కారు నిలిపి.. సెలవులో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు మద్యం సేవిస్తున్నారు. నడిరోడ్డుపై మద్యం సేవించడమేంటని స్థానికులు ప్రశ్నిస్తే.. తాము పోలీస్ కానిస్టేబుళ్లమని బెదిరించారు. ఈ క్రమంలోనే స్థానికులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి.